NewsTelangana

‘గేమ్ ఛేంజర్‌’గా వస్తున్న రామ్‌చరణ్

రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా అభిమానులను చిత్రబృందం సర్‌ప్రైజ్ చేసింది. రామ్‌చరణ్ నటిస్తున్న కొత్త సినిమాకు అదరగొట్టే టైటిల్‌ను ఖరారు చేసింది.

దీనికి ‘గేమ్‌ఛేంజర్’ అని నామకరణం చేశారు. ఆస్కార్ అవార్డు పొందిన RRR తరువాత రామ్‌చరణ్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత  దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా, తమన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రేపు విడుదల చేస్తామని, ఇప్పటి వరకూ చూడని రామ్‌చరణ్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.