కమెడియన్ కాళ్లు పట్టుకున్న రామ్ చరణ్..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఎంతో వినయంగా ఉంటారు. ఎవరు తమ ఇంటికి వచ్చినా, ఎవరు మాట్లాడినా మర్యాదగా పలకరిస్తారు. అయితే ఒక సరదా వీడియోలో రామ్ చరణ్ కమెడియన్ సత్య కాళ్లు పట్టుకోవడంతో అభిమానులు రామ్ చరణ్ చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్‌ను తమ చిత్రం ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ ఫస్ట్ టికెట్ రిలీజ్ చేయించడానికి సత్యతో పాటు బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా వచ్చారు. వీరిద్దరితో మాట్లాడుతూ రామ్ చరణ్ సత్యను గుర్తించలేనట్లు యాక్ట్ చేశారు. కాసేపటి తర్వాత ‘పెద్ది షూటింగ్‌కు ఎప్పుడు వస్తున్నావ్ సత్య?’ అని పలకరించడంతో సత్య రామ్ చరణ్ కాళ్లు మొక్కాడు. ప్రతిగా రామ్ చరణ్ కూడా సత్యకు ఒంగి నమస్కారం చెయ్యడంతో అభిమానులు మెచ్చుకుంటున్నారు.

