Home Page SliderNational

ఊపేస్తున్న ఎంటమ్మా.. సల్మాన్, వెంకటేష్‌తో కలిసి రామ్ చరణ్ డ్యాన్స్

బిగ్ స్క్రీన్ పై కొన్నిసార్లు కన్పించే సీన్లు కళ్లకు అంతకు మందెన్నడూ కలగని అనుభూతులను కలిగిస్తుంటాయ్. కొన్నిసార్లు ఆ మరపురాని క్షణాలను చూసి అభిమానులే కాదు, ఇండస్ట్రీ షేక్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సల్మాన్ ఖాన్, వెంకటేష్ కలిసి నటిస్తున్న… కిసీ కా భాయ్ కిసీ కి జాన్ నుండి ఎంటమ్మా అనే సరికొత్త పాట విడుదలయ్యింది. సల్మాన్ ఖాన్ సొంత రిథమ్‌కు డ్యాన్స్ చేయడంతో ట్రాక్ ప్రారంభమవుతుంది. సల్మాన్‌తోపాటుగా, ప్రముఖ నటుడు వెంకటేష్‌తో కలిసి డ్యాన్స్ మస్తీ చేశాడు. ఈ పాటలో పూజా హెగ్డే, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, పాలక్ తివారీ కూడా ఉన్నారు. అదే సమయంలో… రామ్ చరణ్ ఫ్రేమ్‌లోకి ప్రవేశించిన తర్వాత వీడియో పూర్తిగా భిన్నమైన స్థాయికి చేరుకుంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే అదో చరిత్ర అనాల్సిందే. పాట బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, సల్మాన్ ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ ఫ్రేమ్‌ను పంచుకోవడంతో గతంలో ఎన్నడూ కన్పించిన ధ్రిల్ అభిమానులకు కనువిందు చేసింది. ఎంటమ్మా పాటను పాయల్ దేవ్ స్వరపరచగా, విశాల్ దద్లానీతో కలిసి పాయల్ దేవ్ పాడారు. లిరిక్స్ షబ్బీర్ అహ్మద్. రాప్‌ను రాఫ్తార్ రాశారు. ఈ పాటకు అదనపు సాహిత్యం, గానం ఆదిత్య దేవ్ చేశారు. ఈ పాటలో ప్రత్యేకంగా కనిపించిన రామ్ చరణ్, తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో వీడియోను పంచుకున్నాడు. స్క్రీన్‌పై నా అత్యంత విలువైన క్షణాలలో ఒకటి. లవ్ యూ భాయ్. ఈ సంపూర్ణ లెజెండ్స్‌తో డ్యాన్స్ చేయడం… ఇప్పుడు ఏంటమ్మా పాట విడుదలైందని రాసుకొచ్చాడు.