‘రక్కయి’ చిత్రం టీజర్.. అపరకాళిలా నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార జన్మదినం సందర్బంగా ఆమె కొత్త సినిమా ‘రక్కయి’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరక్టర్ సెంథిల్ నల్లసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌లో ప్రేక్షకులకు సరికొత్త నయనతార కనిపించింది. తన బిడ్డను ఊయలలో ఊపుతూ తల్లిగా నటిస్తోంది నయన్. ఒక పక్క అమ్మతనం చూపిస్తూ, మరోపక్క తన ఇంటిపై పదుల సంఖ్యలో వస్తున్న దుండగులను ఒంటరిగా ఎదుర్కొంటూ భీకర యుద్ధం చేస్తూ హతమారుస్తోంది. ఎర్రచీర కట్టుకుని అపరకాళిలా కత్తులు, శూలాలతో విరుచుకుపడుతోంది. పల్లెటూరి నేపథ్యంలో కనిపిస్తున్న ఈ చిత్రం యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.