ఆసుపత్రి నుంచి తలైవా డిశ్చార్జ్
అనారోగ్యంతో గత నెల 30న అపోలో ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంపై వాపు రావడంతో వైద్యులు ఆయన కు నాన్ సర్జికల్ ట్రాన్స్ కాథెటర్ పద్ధతిలో స్టెంట్ వేశారు. ఈ మేరకు చికిత్స అనంతరం వైద్యులు రజినీని మూడు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంటడంతో ఉదయం డిశ్చార్జ్ చేశారు. అయితే మరో వారం రోజుల పాటు వైద్యులు ఆయనను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజినీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆందోళనకు గురైన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిం చారు. ప్రధాని మోడీ సైతం రజినీ కుటుంబ సభ్యులతో ఫోన్లో ఆయన ఆరోగ్యంపై ఆరా తీసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

