Home Page SliderNational

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా రజనీకాంత్ చిత్రం..

రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయాన్‌ – ది హంటర్‌’. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ రాజా డైరెక్షన్‌లో రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 10న రిలీజై ప్రేక్షకుల ముందుకురాబోతోంది. బుధవారం ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్‌ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్‌ను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోనే పేరుపొందిన టెర్రర్ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా చూపించారు. ‘మనకు ఎస్పీ పేరు మీద ఒక యముడే వచ్చి దిగాడు డిపార్ట్‌మెంట్‌లోకి..’ అంటూ నేరస్థులంతా వేట్టయాన్‌ను చూసి భయపడిపోతుంటారు. అసాంఘిక శక్తుల ఆటకట్టించే పవర్‌ఫుల్‌ యాక్షన్ పోలీస్‌ ఆఫీసర్‌గా రజనీకాంత్‌ నటన ఒక రేంజ్‌లో ఉండబోతోంది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వేట్టయాన్‌ జీవితంలో తెలియని కోణాలెన్నో ఉన్నాయి, అవేమిటో? అతను ఏ లక్ష్యం కోసం బయలుదేరాడో? అనే అంశాలు ఆసక్తికరంగా, ప్రేక్షకులకు ఆశ్చర్యకరంగా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది. అమితాబ్‌ బచ్చన్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికాసింగ్‌, దుషరా విజయన్‌, రోహిణి, అభిరామి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. పాన్‌ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా ఉండబోతోందని ప్రేక్షకులు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు.