Andhra PradeshHome Page Slider

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనే హక్కు రజనీకాంత్‌కు లేదు

ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేసవి తాపాన్ని మించి హీటెక్కుతున్నాయి. తాజాగా వైసీపీ నేత ఏపీ మంత్రి  దాడిశెట్టి రాజా రజనీకాంత్, చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్, చంద్రబాబు కలిసి ఆనాడు వైస్రాయ్ హొటల్‌లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే కుట్రలు చేశారని ఆరోపించారు. అప్పటి ఫొటోను మీడియాకు ప్రదర్శించారు. రజనీకాంత్‌కు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ చాలు అని చంద్రబాబు ఆనాడు కేంద్రంతో లాలూచీ పడ్డారని, తాను తన బినామీలు ఈ ప్యాకేజిని పంచుకోవాలని ప్లాన్ చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కానీ, చంద్రబాబును కానీ ఏపీ ప్రజలు పట్టించుకోరని, వారు ఎన్ని పొత్తులు చేసుకున్నా వైసీపీని ఎదిరించి గెలవలేరని, ధీమా వ్యక్తం చేశారు.