రాజాసింగ్ సంచలన కామెంట్
హైదరాబాద్: మర్డర్లకు పాతబస్తీ అడ్డాగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రాత్రివేళల్లో పోలీసులు గస్తీకి వస్తే ఎంఐఎం నేతలు వారిని బెదిరిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతలు కాపాడితే ఎంఐఎం నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి వస్తున్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గొడవలు జరగకుండా ఉండాలంటే సీఎం రేవంత్ రెడ్డి మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు.