Breaking NewsHome Page SliderTelangana

టిబిజెపి నేత‌ల‌పై రాజాసింగ్ ఫైర్‌

సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తున్నట్లు చెప్పారు. కొత్త ప్రెసిడెంట్​ను ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా, జాతీయ నాయకత్వమా? అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్‌ స్టాంప్‌గానే ఉంటారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని జాతీయ కమిటీ నిర్ణయిస్తే బాగుంటుందని, గతంలో ప‌నిచేసిన‌ అధ్యక్షుడు గ్రూప్ తయారుచేసుకొని పార్టీకి నష్టం చేశారని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులను, జైలుకెళ్లిన కార్యకర్తలని గతంలో పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చే అధ్యక్షుడు అదే గ్రూపిజం చేస్తే పార్టీకి నష్టమని, ప్రస్తుతం పార్టీలో మంచి నాయకుల చేతులు కట్టి పడేశారని పేర్కొన్నారు.సీనియర్‌ నాయకులకు స్వేచ్ఛ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ తెలిపారు. పార్టీ కొత్త అధ్యక్షుడు సీఎంతో రహస్య భేటీలు నిర్వహించవద్దని, సీనియర్‌ నేతలు, కార్యకర్తల మనసులో మాట బయటపెడుతున్నాని అన్నారు. ఇలాంటివి పార్టీ నేతలకు చెప్పాలే తప్ప మీడియాకు చెప్పవద్దని కొందరు చెబుతున్నట్లు తెలిపారు.