NewsTelangana

రాజగోపాల్‌ రెడ్డికి జ్వరం.. ప్రచారానికి బ్రేక్‌

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి జ్వరం వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల ప్రచారంలో గత కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు తిరుగుతున్న రాజగోపాల్‌ రెడ్డి అస్వస్థతకు గురయ్యారని బీజేపీ నాయకులు చెప్పారు. దీంతో మంగళవారం నాంపల్లిలో నిర్వహించాల్సిన ప్రచారానికి బ్రేక్‌ వేసిన ఆయన మంగళవారం విశ్రాంతి తీసుకున్నారు. అయితే.. బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజగోపాల్‌ రెడ్డి అనారోగ్యానికి గురికావడంతో బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రచారం సందర్భంగా ఇటీవల రాజగోపాల్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ కార్యకర్తలు భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు.