Home Page SliderTelangana

సీఎంకు రాజాసింగ్ రిక్వెస్ట్..

సీఎం రేవంత్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను నగర శివారులో పెట్టాలని సీఎం రేవంత్ కి రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్‌తో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. మరోవైపు పార్కింగ్ పేరుతో ప్రజల్ని నిర్వాహకులు దోచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఫ్రీ పార్కింగ్ సదుపాయం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని రాజాసింగ్ కోరారు.