NewsTelangana

రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలి

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కోరారు. రాజాసింగ్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని… ఆయనను సభ నుంచి బహిష్కరించాలంటూ స్పీకర్‌కు లేఖ రాశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని… రాజాసింగ్‌ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.

మరోవైపు… సెక్షన్‌ 41 సీఆర్‌పీసీ కింద నోటిస్‌ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్‌ ఇచ్చారని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఉద్దేశంతోనే రాజాసింగ్‌ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేసి వీడియో శాంపిల్‌ తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ లేఖలో పేర్కొన్నారు.