మీడియాపై రాజ్ కుంద్రా ఆగ్రహం
ఈడీ దాడులపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తీవ్రంగా స్పందించారు. అశ్లీల చిత్రాలతో ముడిపడిన మనీ ల్యాండరింగ్ కేసులో నిన్న ఈడీ రాజ్ కుంద్రా నివాసం, కార్యాలయాలతోపాటు ఆయన సన్నిహితుల కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించింది. ‘వాస్తవాన్ని సంచలనం దాచబోదు’ అని రాజ్ కుంద్రా వ్యాఖ్యానించారు. ఈ కేసుతో తన భార్య శిల్పాశెట్టిని ముడిపెట్టడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు. ‘సహచరులు’, ‘పోర్నోగ్రఫీ’, ‘మనీలాండరింగ్’ వంటి పదాలు ఎంతటి సంచలనం సృష్టించినా నిజాన్ని మరుగుపరచలేవని, చివరికి న్యాయమే గెలుస్తుందని తన ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పేర్కొన్నారు.