తెలంగాణాను ముంచెత్తిన వానలు
నిన్నటి రోజున పడిన వర్షం హైదరాబాద్ నగరవాసులకు చుక్కలు చూపెట్టింది. సాయంత్రం ఆఫీసులు, కాలేజీలు వదిలే సమయంలో వర్షం బీభత్సంగా కురిసింది. ఈదురుగాలులతో, జోరున కురిసే వానలో ఇంటికి వెళ్లడానికి నగర వాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. నేడు కూడా వర్షం వదిలేది లేదని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు రాబోతున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మేడ్చల్, గద్వాల్, వనపర్తి జిల్లాల్లో వర్షం పడుతుందని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, హనుమకొండ, మెదక్, కామారెడ్డి,వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాలలో ఉరుములతో, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవబోతోందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

