తెలంగాణాలో జోరుగా వడగళ్లవాన
తెలంగాణాలో హఠాత్తుగా వాతావరణం మారిపోయింది. నిన్నటి వరకూ వేడిగా ఉన్న వాతావరణం చల్లబడింది. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన జోరుగా కురుస్తోంది. ఓ పక్క హైదరాబాద్లో కూడా పలుచోట్ల గాలులతో కూడిన వర్షం మొదలయ్యింది. ఈ వడగళ్ల వానకు ఇప్పుడుప్పుడే కాస్తున్న మామిడి కాయలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వడగళ్లు జోరుగా పడడంతో రోడ్లపై మంచు పేరుకున్న దృశ్యాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వడగళ్ల వల్ల వరిపంటకు కూడా నష్టం జరుగుతుంది. బలమైన క్యుములోనింబస్ మేఘాల వల్ల ఇలాంటి వర్షాలు పడతాయని, ఈ మేఘాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.


 
							 
							