Andhra PradeshHome Page Slider

ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు

ఏపీ వాసులకు ఈ వేసవిలో వాతావరణశాఖ చల్లటి వార్త తెలిపింది. అదేంటంటే ఏపీలోని గుంటూరు , కృష్ణా, గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కోనసీమ, కాకినాడ,ఎన్టీఆర్ ఏలూరు,ఉభయ గోదావరి,అనకాపల్లి,విశాఖ,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. అయితే ఇవాళ మధ్యహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో పొడి వాతావరణంతోపాటు,ఎండ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. మరోపక్క ఏపీలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.