Home Page SliderTelangana

తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు..

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 27వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు వర్షాల ధాటికి రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. మూడు వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 32 వేల కేసులు నమోదయ్యాయి. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు పది శాతం మేర ఉన్నాయి. అందులో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండట గమనార్హం. ఇప్పటికే రోగులతో ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోయాయి. గడచిన 24 గంటల వ్యవధిలో డెంగీ జ్వరంతో 5 గురు మరణించారు.