NationalNews

బెంగుళూరులో వర్ష భీభత్సం

మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలను వణికించిన వర్షాలు తాజాగా కర్ణాటకను తాకి భీభత్సం సృష్టిస్తున్నాయి. బెంగుళూరును వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో బెంగుళూరు సిటీ అంతా జలదిగ్భందంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో రోడ్లు,రహదారులు జలమయమయ్యాయి. దీంతో నేడు బెంగుళూరులో జరగాల్సిన గణేష్ నిమజ్జనానికి ఆటంకం ఏర్పడింది. బెంగుళూరులోని పలు కాలనీలు ,అపార్ట్‌మెంట్ బేస్‌లోకి వర్షపునీరు చేరాయి. దీనివల్ల అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా బెంగుళూరులోని ఎకో స్పేస్ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అక్కడి సీవీ రామన్ నగర్‌లో అత్యధికంగా 44 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.