టీమిండియా రికార్డుల వర్షం
సౌతాఫ్రికాతో జరిగిన టీ20లో టీమిండియా దుమ్ము రేపింది. పలు రికార్డులను తిరగరాసింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. భారత్ రికార్డులు చూస్తే మెన్స్ టీ20లో మూడు సార్లు 250కి పైగా రన్స్ చేసిన రికార్డును సాధించింది. సంజూ శాంసన్, తిలక్ వర్మ నమోదు చేసిన 210 పరుగులు భాగస్వామ్యం భారత్‌లోనే అత్యధిక స్కోరు. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ మొత్తం సిరీస్‌లో 4 సెంచరీలు సాధించి రికార్డు సృష్టించారు. సంజూ శాంసన్ 109 పరుగులు, తిలక్ వర్మ 120 పరుగులు చేసి టీమిండియా యువ ప్లేయర్ల సత్తా చాటారు. తిలక్ వర్మ ఈ మొత్తం సిరీస్‌లో రెండు సెంచరీలు చేసి అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కైవశం చేసుకున్నారు.