కాసేపట్లో పలకరించబోతున్న చిరుజల్లులు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణా వ్యాప్తంగా ఎండబాధితులకు శుభవార్త. ఈరోజు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, నల్లగొండ,నాగర్ కర్నూల్, జగిత్యాల, జనగాం,యాదాద్రి భువనగిరి,వరంగల్, హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడవచ్చని సమాచారం. ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వార్త ఆనందాన్ని కలిగిస్తోంది. రాబోయే మూడు గంటల్లో చిరుజల్లులు పడవచ్చు.

