తెలంగాణాలో మరికాసేపట్లో వర్షం
తెలంగాణాలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ..రైతులకు మాత్రం తీరని నష్టాన్ని మిగిల్చింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో తెలంగాణా రైతులు బాగా నష్టపోయారు. అయితే మరోసారి వరుణుడు రాష్ట్రాన్ని పలుకరించబోతున్నాడు. తెలంగాణాలోని పలు జిల్లాలలో మరికాసేపట్లో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. కాగా మెదక్,ములుగు,కామారెడ్డి,భద్రాద్రి,మేడ్చల్,యాదాద్రి,నాగర్‌కర్నూల్‌లో వర్షం పడునుందని వాతావరణశాఖ పేర్కొంది. అయితే తెలంగాణాలో ఈరోజు,రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.