తెలంగాణాకు మరోసారి వర్ష సూచన
తెలంగాణా రాష్ట్రాన్ని మరోసారి వరుణుడు కరుణించబోతున్నాడు.ఈ మేరకు తెలంగాణా వ్యాప్తంగా మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లో మరి కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధాని నగరంతో పాటు రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, నల్గొండ, నారాయణపేట్, సంగారెడ్డి ,సూర్యాపేట్, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షం పడే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

