Home Page SliderTelangana

తెలంగాణాలో నేడు,రేపు వర్షాలు

తెలంగాణాలో నేడు,రేపు వర్షాలు కురిసే అవకాశముందని తెలంగాణా స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణా రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో  ఇవాళ ,రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణా స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణాలో రానున్న 48 గంటల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. అయితే పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.ఈ నేపథ్యంలో తెలంగాణాలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణా స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సూచించింది.