Home Page SliderNational

అస్సాంలో రాహుల్ పర్యటన

అస్సాంలోని వరదల కారణంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పర్యటించారు. ఎయిర్‌పోర్టులో కలిసిన అస్సాం, మణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ నేతలతో కచార్ జిల్లాలోని సిల్చార్‌ను సందర్శించారు. అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర, బరాక్‌ వంటి ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా కామ్‌రూప్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. 47వేల మందికి పైగా ఈ వరదల వల్ల సహాయక శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే అస్సాంలో ఆరుసార్లు వరదలు సంభవించాయి. అస్సాం పర్యటన అనంతరం రాహుల్ గాంధీ హింసాత్మక సంఘటనలో అతలాకుతలమవుతున్న మణిపూర్‌ను సందర్శించనున్నారు.