లోక్‌సభలో రాహుల్ వీరావేశం..సొంత కూటమిపై కూడా సెటైర్లు..
యువతకు ఉద్యోగ కల్పన విషయంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంతో పాటు సొంత కూటమైన యూపీఏ ప్రభుత్వం కూడా యువతకు సమాధానం చెప్పలేకపోయిందంటూ వీరావేశంతో విరుచుకుపడ్డారు. మేకిన్ ఇండియాతో భారత్‌కు ఒరిగిందేమీ లేదని, జీడీపీలో తయారీ రంగ వాటా తగ్గిపోయిందని మండిపడ్డారు. అనంతరం చైనా ఆక్రమణలపై మాట్లాడుతూ భారత్‌లో ఎంత భాగాన్ని చైనా ఆక్రమించుకుందో ప్రధాని మాటలకు, సైన్యం మాటలకు పొంతనలేదని విమర్సించారు. దీనితో స్పీకర్ ఓంబిర్లా కలుగజేసుకుని ఆధారాలు లేకుండా రక్షణకు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మాటలు సభలో మాట్లాడడం సరికాదన్నారు.

