‘రాహుల్.. నెహ్రూ లేఖలు ఇస్తారా?’.. పీఎంఎంఎల్
స్వతంత్య్ర భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను సోనియా తీసుకున్నారని, వాటిని తిరిగి అప్పగించాల్సిందిగా పీఎంఎంఎల్ రాహుల్ గాంధీని కోరింది. పండిట్ నెహ్రూ అప్పట్లో మౌంట్ బాటెన్, ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, విజయ లక్ష్మీ పండిట్, బాబు జగ్జీవన్ రామ్ వంటి ప్రముఖులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో ఉన్నాయని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన మంత్రుల జ్ఞాపకాలతో ప్రధాని సంగ్రహాలయానికి దీనిని ఇవ్వవలసిందిగా కోరారు. ఇలాంటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన లేఖలు 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి అప్పగించింది. కానీ వీటిని 2008లో 51 బాక్సుల్లో ప్యాక్ చేసి, సోనియాగాంధీ తీసుకున్నారు. అవి అప్పటి నుండి ఆమె వద్దే ఉన్నాయి. వాటిని అప్పగించాలని గత మూడు నెలలుగా పీఎం ఆఫీస్ రాహుల్ గాంధీని కోరుతోంది. కనీసం డిజిటల్ కాపీస్ లేదా ఫోటో కాపీస్ అయినా ఇవ్వాలని కోరింది.

