రాహుల్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని బీజేపీ ఎంపీ కంగన రనౌత్ విమర్శించారు. ప్రధాని కాకపోతే దేశాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా ఆయన అజెండా అని దుయ్యబట్టారు. హిండెన్‌బర్గ్ నివేదికను ఆధారంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేశ భద్రత, ఆర్థిక స్థితిని అస్థిర పరిచేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. ఆయన జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉండేలా ప్రవర్తిస్తున్నారు. ఆయనను ఎప్పటికీ నాయకుడిగా ప్రజలు చేసుకోరు అని అన్న కంగన.

