ములుగులో రాహుల్ ,ప్రియాంక గాంధీ పర్యటన
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు రాహుల్ ,ప్రియాంక ఇప్పటికే ములుగు జిల్లాకు చేరుకున్నారు. అయితే ముందుగా వారు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల కార్డుకు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం వారు ములుగు జిల్లా సమీపంలోని జానకిపురంలో పర్యటిస్తున్నారు. మరికాసేపట్లో వారు ములుగులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చేరుకోనున్నారు. అనంతరం వారు ములుగు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి రాహుల్,ప్రియాంక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో రాహుల్,ప్రియాంక గాంధీలతో పాటు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్,భట్టి విక్రమార్క పాల్గొన్నారు.


 
							 
							