‘ప్రధాని పదవికి రాహుల్ అడుగు దూరంలో ఉన్నారు’..రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీభవన్‌లో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని పదవికి మరొక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న కాలంలో రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకున్నారని పేర్కొన్నారు. వైఎస్ చేసిన అభివృద్ధి తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతోందన్నారు. ఆయన పాదయాత్రలో సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరించారన్నారు. రాహుల్ గాంధీ కూడా ఆయన పాదయాత్ర స్పూర్తిగా తీసుకుని భారత్ జోడో యాత్ర చేశారన్నారు. అప్పటి ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పరిపాలనలో ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావడమే వైఎస్ ఆశయం అన్నారు. ప్రజా నాయకుడైన రాహుల్‌ను ప్రధానిగా చేయడానికి మనమందరం కృషి చేయాలని సూచించారు. నేడు 35 కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలను ఎంపిక చేశామని, నేడు వైఎస్ జయంతి సందర్భంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.