Home Page SliderNational

పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో కాస్త ఊరట లభించింది. కాగా ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు అయ్యింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేతలు ఆయనపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన బెంగుళూరు సివిల్ కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.