NationalNews

కొరడాతో కొట్టుకున్న రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కొరడాతో కొట్టుకున్నారు. భారత్‌ జోడో యాత్రను ఆయన గురువారం సంగారెడ్డి జిల్లాలో కొనసాగించారు. ఈ సందర్భంగా రాహుల్‌కు పోతురాజులతో కలిసి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాలు, పోతురాజుల గురించి రాహుల్‌కు జగ్గారెడ్డి వివరించారు. అదే సందర్భంలో పోతురాజులు కొరడాతో తమను తాము కొట్టుకున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొరడాతో కొట్టుకున్నారు. వెంటనే జగ్గారెడ్డి నుంచి కొరడా తీసుకున్న రాహుల్‌ గాంధీ తానూ ఆ కొరడాతో రెండుసార్లు కొట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కేరింతలు, ఈలలతో సందడి చేశారు. ఉదయం చిన్నారులతో కలిసి కరాటే చేసిన రాహుల్‌.. గిరిజన నృత్యకారులతో కలిసి నృత్యం చేశారు.