షెఫ్ గా మారిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ షెఫ్ గా అవతారమెత్తారు. మహారాష్ట్రలోని ఓ దళితుడైన సామాన్య కార్యకర్త ఇంటిలోని వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. కొల్హాపూర్ లోని షాహు పటోలే ఇంటి సాదరంగా ఆహ్వానించగా.. రాహుల్ గాంధీ వెళ్లారు. పటోలే ఇంట్లో పాలకూర మరియు వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశారు. అనంతరం షాహు పటోలే, ఆయన భార్య అంజనాతో కలిసి భోజనం చేశారు. షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు. రాహుల్ గాంధీకి షాహు పటోలే దలిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వాడా గురించి వివరించారు.