Home Page SliderNational

రాహుల్ గాంధీ@ సుల్తాన్‌పూర్ కోర్ట్

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ సుల్తాన్ పూర్ కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ కేంద్రమంత్రి అమిత్ షాపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు 2018లో రాహుల్‌పై పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి ఈ ఏడాది ఫిబ్రవరి 20న బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా ఈ కేసుపై విచారణను ఈ రోజుకు వాయిదా వేసింది. దీంతో రాహుల్ గాంధీ ఇవాళ సుల్తాన్ పూర్ కోర్టులో విచారణకు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో సుల్తాన్ పూర్‌లోని కాంగ్రెస్ కార్యకర్తలు పూలతో రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు.