Home Page SliderNational

రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ

భారత్ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల విషయంలో రెజ్లర్లు అందరూ ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసిందే. ఈ సందర్భంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెజ్లర్లను కలుసుకున్నారు. వారికి తన మద్దతు ప్రకటించారు. హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన అఖాడాలో వీరందరూ సమావేశం అయ్యారు. బజరంగ్ పునియా ఈ సమావేశంపై మాట్లాడుతూ, రాహుల్ తమ రెజ్లింగ్ రొటీన్ చూడడానికి వచ్చారని, తమతో రెజ్లింగ్ కూడా చేశారని పేర్కొన్నారు.   ఈ సమాఖ్య అధ్యక్షునిగా ఎన్నికైన బ్రీజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ నియామకానికి వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళనలు చేశారు. మహిళా రెజ్లర్లపై  లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్‌కు, కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్‌కు వ్యతిరేకంగా బజ్ రంగ్ పునియా, వీరేందర్ యాదవ్‌లు తమ పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశారు. సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఖేల్ రత్న, అర్జున్ అవార్డులను వినేశ్ ఫొగట్ వెనక్కు ఇచ్చేశారు.