సింగరేణి కార్మికులను కలిసిన రాహుల్ గాంధీ
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ రెండు రోజుల నుంచి తెలంగాణాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ రోజు పెద్దపల్లిలో పర్యటించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పెద్దపల్లిలోని సింగరేణి కార్మికులను కలిశారు.దీంతో సింగరేణి కార్మికులు సింగరేణిలో రాజకీయ ప్రమేయం బాగా పెరుగుతోందని రాహుల్‌కు తెలిపారు. అంతేకాకుండా సింగరేణిలో అభివృద్ధి జరగలేదని వారు రాహుల్‌కు వివరించారు. కాగా సింగరేణిలో దోపిడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని సింగరేణి కార్మికులు రాహుల్ గాంధీకి తెలిపారు.

