Home Page SliderTelangana

రాహుల్ గాంధీ సోమవారం లోక్ సభకు రావొచ్చు

మోడీ ఇంటి పేరుకు సంబంధించి పరువు నష్టం కేసులో విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఉపశమనం లభించడంతో ఇప్పుడు ఆయన పార్లమెంట్ కు హాజరు విషయమై కొత్త చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఆలోచంచడానికి ఏం లేదని రాహుల్ గాంధీ ఇకపై పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనచ్చంటూ నిపుణులు తేల్చి చెబుతున్నారు. మోదీ ఇంటిపేరు’ కేసులో కాంగ్రెస్ నేత దోషిగా తేలడంతో సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటుకు వెళ్లవచ్చున్నారు రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ. పరువునష్టం కేసులో రెండేళ్ల శిక్ష విధించడానికి కారణాలు సరిపోవని సుప్రీంకోర్టు గుర్తించిందని ఆయన అన్నారు.