రాహుల్ గాంధీకి సుప్రీంలో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణపైనే సుప్రీంకోర్టు స్టే విధించింది. న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మహతాలతో కూడిన ధర్మాసనం జార్ఖండ్ ప్రభుత్వానికి, పిటిషనర్ బీజేపీ కార్యకర్త నవీన్ ఝాకు కూడా నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా తమ సమాధానాలను సమర్పించాలని కోరారు. ఆరు వారాల తర్వాత ఈ కేసుపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.