రాహుల్ గాంధీకి కొత్త బంగ్లా కేటాయించిన ప్రభుత్వం
2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీ కోసం కొత్త బంగ్లాను కేటాయించింది ప్రభుత్వం. సునేహ్రీ బాగ్ రోడ్‌లోని నెంబర్ 5 బంగళాను రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ ఆఫర్ కల్పించింది. దీనిని రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ పరిశీలించినట్లు తెలిస్తోంది. పరువునష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించింది. దీనిపై లోక్ సభ ఆయనపై ఎంపీగా అనర్హత వేటు వేసి, తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగళాను ఖాళీ చేయించింది. దీనితో ఆయన 10 జనపథ్‌లో తన తల్లి సోనియా గాంధీ నివాసానికి మారారు. అప్పటి నుండి ఆయన ఇప్పటి వరకూ అక్కడే ఉంటున్నారు. 2004లో మొదటి సారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు రాహుల్ గాంధీ. అప్పటి నుండి ఎంపీగా అనర్హత వేటు పడేంత వరకూ తుగ్లక్ లేన్ బంగ్లాలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదాను కలిగి ఉన్నారు. దీనితో టైప్ 8 బంగళాకు ఆయన అర్హత పొందారు.