NewsTelangana

తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలోకి అడుగుపెట్టారు. రాయచూర్ వద్ద కృష్ణా నదీ సమీపంలో మక్తల్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టి తెలంగాణ గడ్డను ముద్దాడారు. తెలంగాణలో లభించిన స్వాగతం జీవితంలో మరువలేనన్నారు రాహుల్. పాదయాత్రకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడంతో సరిహద్దు నలువైపులా జనం పోటెత్తారు. రాహుల్ ను చూడటానికి జనం ఎగబడ్డారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. తెలంగాణలో అధికారికంగా ఇవాళ రాహుల్ పాదయాత్ర మొదలైన మరో మూడు రోజుల తర్వాత పూర్తి స్థాయిలో యాత్ర సాగనుంది. రేపు దివాళీ సందర్భంగా రేపు, ఎల్లుండి సెలవు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్లోకి మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు. ఆయన ప్రమాణస్వీకార మహోత్సవానికి రాహుల్ హాజరుకానున్నారు.