పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి లభించని ఊరట
పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు నుండి రాహుల్ గాంధీకి ఉపశమనం లభించలేదు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన తర్వాత, ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వేసవి సెలవుల తర్వాత తీర్పు వెల్లడించినున్నట్టు కోర్టు పేర్కొంది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి, కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత తుది తీర్పు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఉత్తర్వులను రిజర్వ్ చేశారు.