ట్రంప్ ముందు మోదీ భయపడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ అన్నారు – “మోదీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయబోమని తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించినా, ప్రధాని ఇప్పటివరకు స్పందించలేదు. ఇది దేశ ప్రయోజనాలను విస్మరించినట్లే” అని అన్నారు.
అలాగే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై మరిన్ని విమర్శలు చేస్తూ, “ఈజిప్టులో జరిగిన పీస్ సమ్మిట్‌కు మోదీ హాజరుకాలేదు, ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నా ఆయన శుభాకాంక్షలు మాత్రం తెలియజేస్తారు. ఆపరేషన్ సిందూర్ విషయంపై ట్రంప్ విరుద్ధంగా మాట్లాడినా మోదీ మౌనంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.