Home Page SliderNational

మళ్లీ ఎంపీగా రాహుల్ గాంధీ… సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత!

‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యపై క్రిమినల్ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విధించిన శిక్షపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి సముచితం కాదని కోర్టు పేర్కొంది. ట్రయల్ జడ్జి ఈ కేసులో గరిష్టంగా రెండేళ్ల శిక్షను విధించగా… శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే అనర్హత వేటు పడేది కాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రాహుల్ గాంధీ ఏప్రిల్‌లో సూరత్‌లోని సెషన్స్ కోర్టులో 2019 పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు తన దోషిగా నిర్ధారించడం తప్పని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు వేసే విధంగా శిక్ష విధించారని రాహుల్ గాంధీ తెలిపారు. ట్రయల్ కోర్టు తన పట్ల కఠినంగా ప్రవర్తించిందని, ఎంపీగా తన స్థాయిని “అధికంగా ప్రభావితం” చేశారని చెప్పారు.


ఐతే, పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు మంచి అభిరుచితో లేవని చెప్పడంలో సందేహం లేదన్న కోర్టు… ప్రసంగాలు చేయడంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. “అనర్హత పరిణామాలు వ్యక్తి హక్కును మాత్రమే కాకుండా ఓటర్లను కూడా ప్రభావితం చేస్తాయి” అని కోర్టు అభిప్రాయపడింది. నిర్దోషిగా విడుదల కావడానికి ముందు రాహుల్ గాంధీకి ఇదే ఆఖరి అవకాశం అని, ఆయన పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తారంటూ ఆయన తరపు న్యాయవాది గతంలో కోర్టులో వాదిస్తూ, హైకోర్టు తన తీర్పును 66 రోజుల పాటు రిజర్వ్ చేసిందని, ఈ కేసులో దోషిగా తేలడంతో.. గాంధీ ఇప్పటికే రెండు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనలేకపోయారు. శిక్షపై స్టే విధించాలన్న రాహుల్‌గాంధీ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, సంజయ్‌కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. క్రిమినల్ పరువు నష్టం కేసులో విధించిన శిక్షపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు గతంలో నిరాకరించింది.

రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, విచారణ పూర్తయిందని, దోషిగా నిర్ధారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 30 కోట్ల మంది ప్రజలు గుర్తించదగిన వర్గంగా ఉండడం ఇదే తొలిసారి అని సింఘ్వీ అన్నారు. రాహుల్ గాంధీపై ఫిర్యాదు నిరాధారమైనదని, కమ్యూనిటీలు, కులాలు, ‘మోడీ’ అనే పేరుతో ఉన్న సమూహాలకు పూర్తి భిన్నమైనవని ఆయన అన్నారు. విచారణ ప్రారంభంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీపై అసాధారణమైన కేసు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఫిర్యాదుదారు పూర్ణేష్ మోడీ అసలు ఇంటిపేరు మోడీ కాదని సింఘ్వీ వాదించారు. ఆయన దానిని మార్చుకున్నారన్నారు. “ఫిర్యాదుదారు పూర్ణేష్ మోడీ స్వయంగా, తన ఇంటిపేరు మోడీ కాదని చెప్పాడని, తాను మోద్ వనికా సమాజ్‌కి చెందినవాడని వాదించాడని సింఘ్వి తెలిపారు. రాహుల్ ప్రసంగంలో పేర్కొన్న వ్యక్తులలో ఒక్కరు కూడా ఆయనపై దావా వేయలేదని వాదించారు.


13 కోట్ల మంది సంఘంలో దావా వేస్తున్న వ్యక్తులు మాత్రం బీజేపీ కార్యాలయ యజమానులంటూ విమర్శించారు సింఘ్వి. రాహుల్ నేర చరిత్ర గురించి ట్రయల్ కోర్టు కూడా మాట్లాడిందని సుప్రీం కోర్టు ఎత్తిచూపింది. 13 కేసులను ఉదహరించారని, ఆ కేసుల్లో ఏ ఒక్క కేసులోనూ దోషిగా నిర్ధారించబడలేదని నేరపూరిత పూర్వాపరాల కోసం ఇవి ఎలా ఉదహరించారంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తాను నిర్దోషి అని చెబుతూనే, తన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని బుధవారం రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తద్వారా లోక్‌సభ కొనసాగుతున్న సమావేశాలు, ఆ తర్వాత సమావేశాలలో పాల్గొనేందుకు వీలు కల్పించాలన్నారు. ఏప్రిల్ 2019లో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో, రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి, “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అంటూ దెప్పిపొడిచారు.