హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో హైటెక్ సిటీకి రాహుల్ గాంధీ బయలుదేరారు. భారత్ సమ్మిట్ కు కాంగ్రెస్ అగ్రనేత హాజరుకానున్నారు.

