InternationalNews

రాహుల్‌కు కొవిడ్..షాక్‌లో టీమ్‌ఇండియా

 త్వరలో ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది. ఈ నెల 27న ప్రత్యర్ధుల మధ్య పోరు జరగనుంది. యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో పాల్గొనేందుకు జట్లు ఇప్పటికే సిద్దమయ్యాయి. ఇటువంటి సమయంలో భారత్‌కు పెద్ద షాక్ తగిలింది.

దీంతో టీమ్‌ఇండియా ఛీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్  లేకుండా భారత జట్టు యూఏఈకి పయనమవ్వాల్సి వచ్చింది.  ఎందుకంటే ఆయన తాజాగా కొవిడ్ బారిన పడ్డారు. యూఏఈ  వెళ్ళడానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన తన ప్రయాణాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ఈ నెల 28న టీమ్‌ఇండియాకు పాక్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.  అయితే అప్పటికల్లా రాహుల్ కోలుకొని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.