NationalNews Alert

గుజరాత్ రైతులకు 3 లక్షల రుణమాఫీ

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వరాల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  పలు హామీలు చేశారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రైతులకు 3 లక్షల రుణమాఫీని అమలులోనికి తీసుకొస్తామన్నారు. గుజరాత్ లోని అన్ని వ్యవస్థలను బీజేపీ తన చేతుల్లోకి తీసుకుందని అగ్రహం వ్యక్తం చేశారు. అంపైర్‌లా వ్యవహరించాల్సిన  పోలీసులు , న్యాయ వ్యవస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.