Home Page SliderNational

సూరత్‌కోర్టుకు చేరనున్న రాహుల్, ప్రియాంక

లోక్‌సభ అనర్హత వేటుపై అప్పీల్ చేయనున్న రాహుల్ గాంధీ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాత్ కోర్టుకు రానున్నారు. ఒక పూర్తి బస్సుతో కాంగ్రెస్ నాయకులు ఈ సెషన్స్ కోర్టుకు రాబోతున్నారు. వేలమంది పోలీసులు ఈ కోర్టు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా రానుండడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతమంది కోర్టుకు రావలసిన అవసరం ఏముందని, రాహుల్ గాంధీ లాయర్లతో వస్తే సరిపోతుందని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తమ బలాన్ని, బలగాన్ని చూపించుకొనే మెగా షోను కాంగ్రెస్ ఏర్పాటు చేసుకుంటోందని మండిపడుతున్నారు. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ సూరత్ ఎయిర్‌పోర్టులో లాండయ్యారని సమాచారం. ఇది కేవలం కోర్టులో ఒక అప్పీల్ మాత్రమేనని, ధైర్యముంటే సామాన్యప్రజల వలే కోర్టుకు రావాలని, విఐపి ట్రీట్‌మెంట్ ఎందుకని, అంతమంది బలగం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.