రాహుల్, ప్రియాంకల అడ్డగింత, భారీగా ట్రాఫిక్ జామ్
యూపీలోని సంభల్‌లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డగించారు. ఘాజీపుర్ సరిహద్దు వద్ద యూపీ పోలీసులు ఆంక్షలు విధించడంతో వారిని యూపీలోకి వెళ్లకూడదంటూ అడ్డుకున్నారు. స్థానికేతరులు అక్కడికి రాకూడదంటూ కాంగ్రెస్ ఎంపీలు, నేతల వాహనాలను అడ్డగించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీనితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సంభల్‌కు స్థానికేతరులెవరూ రావొద్దని పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని ఆదేశించారు.

