పెళ్లైన 29 ఏళ్ల అనంతరం రెహమాన్ విడాకులు
భారత సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాబానుతో వివాహ బంధానికి స్వస్తి పలకనున్నారు. ఆయన లాయర్ వందనా షా ఈ దంపతుల తరపున మంగళవారం ప్రకటన విడుదల చేశారు. 1995లో వీరి పెళ్లి జరిగిన 29 ఏళ్ల అనంతరం వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం వారి మధ్య కొరవడిన భావోద్వేగాలే కారణం అంటూ పేర్కొన్నారు. వీరిపై పరస్పరం ప్రేమానురాగాలు ఉన్నాయని, కానీ అనూహ్య పరిస్థితుల కారణంగా వీరి మధ్య అగాథం ఏర్పడిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. రెహమాన్ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారి కుమారుడు అమీన్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో మా కుటుంబ ప్రైవసీని గౌరవించండి అంటూ పోస్ట్ పెట్టారు.

