ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
ఏపీలో డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. ఈ పదవికి ఆయనొక్కరే నామినేషన్ వేయడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆయన 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు. ఎన్నికలకు ముందు నరసాపురం లోక్‌సభ స్థానం నుండి వైసీపీ తరపున గెలుపొందారు. కానీ గెలిచిన కొద్ది రోజులకే పార్టీలో విబేధాల కారణంగా అప్పటి ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై పలు విమర్శలు చేశారు. దానితో అప్పటి ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు పెట్టింది. గత ఎన్నికలలో టీడీపీ తరపున ఉండి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.