Andhra PradeshBreaking NewsHome Page SliderNational

ర‌ఘురామ రాజుకి సుప్రీం అక్షింత‌లు..!

ఉండి ఎమ్మెల్యే,ఏపి డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణ‌రాజుకి సుప్రీం కోర్టు మొట్టికాయ‌లు వేసింది.ఏపి మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ని ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న వేసిన పిటీష‌న్‌ని సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.అస‌లు జ‌గ‌న్ బెయిల్ ని ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రం ఏం ఉందో చెప్పండి అని ట్రిపుల్ ఆర్‌ని ప్ర‌శ్నించింది.జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుని వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాలని అవ‌స‌ర‌మైతే త‌న పిటీష‌న్‌ని వెన‌క్కి తీసుకుంటాన‌ని ఆయ‌న కోర్టుకువిన్న‌వించాడు .దాంతో కోర్టు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.మీరే అన్నీ డైరెక్ష‌న్ లు ఇస్తారా,వేసిన పిటీష‌న్లు వెన‌క్కు తీసుకుంటారా అంటూ గ‌ద్గ‌ద స్వ‌రంతో ప్ర‌శ్నించింది. దీంతో మాజీ సీఎం జ‌గ‌న్‌కి గ‌ట్టి ఊర‌ట ల‌భించిన‌ట్లైంది.